Indian Woman: కెనడాలో ఘోరం.. భారత సంతతి మహిళ దారుణ హత్య
కెనడాలో భారత సంతతికి చెందిన మహిళ (Indian Woman) దారుణ హత్యకు గురవడం ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. టొరంటో నగరంలో నివసిస్తున్న 30 ఏళ్ల హిమాన్షి ఖురానా (Himanshi Khurana) అనే యువతి తన ప్లాట్లోనే విగతజీవిగా లభ్యమైంది.
పోలీసుల కథనం ప్రకారం, డిసెంబర్ 19వ తేదీ నుండి హిమాన్షి (Himanshi Khurana) కనిపించడం లేదంటూ ఆమె సన్నిహితుల నుండి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమె నివాసానికి వెళ్లి పరిశీలించగా, అక్కడ ఆమె (Indian Woman) మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఇది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని పోలీసులు నిర్ధారించారు.
ఈ కేసులో హిమాన్షితో (Himanshi Khurana) కలిసి ఉంటున్న (Live-in partner) అబ్దుల్ గఫూర్పై పోలీసులు బలమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. హిమాన్షి మరణానికి గఫూరే కారణమని భావిస్తున్న పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు నిందితుడి ఫోటోను విడుదల చేసిన టొరంటో పోలీసులు, అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని కోరారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన యువతి (Indian Woman) ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానిక భారతీయ సమాజం విచారం వ్యక్తం చేస్తోంది.






