అమెరికాలో ఆరుగురు మహిళా టీచర్ల అరెస్టు …
మహిళ టీచర్లు విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడిన ఘటనలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మహిళా టీచర్లను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని డాన్విల్కు చెందిన ఎలెన్ షెల్ (38) 16 ఏళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులతో లైంగిక చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్కన్సాకు చెందిన హెథర్ హరే (32) టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు కేసు నమోదైంది. ఓక్లహోమాకు చెందిన ఎమిలీహాన్కాన్ (26) కూడా ఓ విద్యార్థితో సంబంధం నెరుపుతోందని తెలియడంతో ఆమెను అరెస్టు చేశారు. లింకన్ కౌంటీలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఎమా డిలానె అదే పాఠశాలలో చదువుతోన్న 15 ఏళ్ల విద్యార్థితో సంబంధం పెట్టుకుందని తేలింది. అయోవాలోని ఓ హైస్కూల్లో క్రిసెన్ గ్యాంట్ అనే టీచర్ టినేజీ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు వచ్చాయి. వర్జీనియాలోని హైస్కూల్లో ఓ మహిళ టీచర్ (33) ఓ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తిస్తోందనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదయ్యింది. పెన్సిల్వేనియాకు చెందిన జావెలిన్ కోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.













