అమెరికాలో ఘోర ప్రమాదం
అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు పొరపాటున ఢీ కొన్నాయి. ఒక విమానం గాలిలోనే పేలిపోగా, మరొక విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్లో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో జరిగిందీ దారుణం. వింగ్స ఓవర్ డాల్లస్ పేరుతో డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్ షో ఏర్పాటైంది. ఈ ప్రమాదంలో విమానాలను నడుపుతున్న పైలట్లతో సహా ఆరుగురు మరణించి ఉంటారని అధికారలు అనుమానిస్తున్నారు. ఇందులో ఒక విమానం రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి విమానం కావడం గమనార్హం.
వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న బోయింగ్ బీ-17 యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా విఆనం రెండూ ఆకాశంలో విన్యాసాలు ప్రారంభించాయి. వైమానిక ప్రదర్వనకు వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను తమ ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారు. ఇంతలో బోయింగ్ బీ`17 విమానం వైపు వేగంగా దూసుకువచ్చిన కింగ్ కోబ్రా క్షణాలలో దానిని ఢీ కొట్టింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం, ఆపై కింగ్ కోబ్రా విమానం పేలిపోయింది. బోయింగ్ విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటన మొత్తం సందర్శకుల ఫోన్లలో రికార్డ్ అయింది.













