కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి విజృంభించింది. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. పట్టణంలో రద్దీ ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకునన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎవరీ అరెస్టు చేయలేదు. కాల్పుల ఘటనకు బాధ్యులైన వవారిని కూడా గుర్తించలేదు. అమెరికాలో తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా పెరుగుతోంది. దేశంలో ప్రతిఏటా సుమారు 2 కోట్ల తుపాకులు అమ్ముడవుతూ ఉంటాయి. ప్రజల్లో 30 శాతం మంది తుపాకులను కలిగి ఉంటారు.













