వ్యాక్సిన్ పంపిణీలో… సంపన్న దేశాలు కూడా

తమ దేశం 50 కోట్లు వ్యాక్సిన్‍లను 92 పేద దేశాలకు, ఆఫ్రికా దేశాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని, మిగతా సంపన్న దేశాలు కూడా ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. ఇప్పటికే 8 కోట్ల వ్యాక్సిన్‍లను అందిస్తామని అమెరికా ప్రకటించి, సరఫరా కూడా ప్రారంభించింది. దీనివల్ల వ్యాక్సిన్ పొందే దేశాలతో పాటు అన్ని దేశాలకు మేలు జరుగుతుందన్నారు. ఫ్యాచర్ టీకాలు అమెరికా కొనుగోలు చేసి ఆగస్టు నుంచి పంపిణీ చేస్తుందని అధికారులు వెల్లడించారు. డిసెంబర్ చివరి నాటికి 20 కోట్ల టీకాలు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.