రష్యాకు పోలాండ్ షాక్…
గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అనుమానంతో తమ దేశంలోని 45 మంది రష్యా దౌత్యవేత్తలను పోలాండ్ బహిష్కరించింది. దేశం విడిచి వెళ్లవలసిందిగా వారిని పోలాండ్ ఆదేశించింది. డిప్లమేటిక్ హోదాను ఉపయోగించుకుని పోలెండ్‌లో ఉంటూ రష్యాకు అనుకూలంగా వీరు గూఢచర్యం సాగిస్తున్నట్టు పోలాండ్ అంతర్గత భద్రత సంస్థ గుర్తించింది. తక్షణం ఆ రష్యన్లను (దౌత్యవేత్తలను) దేశం నుంచి బహిష్కరించాలని విదేశాంగ శాఖకు సంస్థ సూచించింది. వారంతా పోలాండ్ భద్రతకు ముప్పు అని భద్రత ఏజెన్సీ పేర్కొంది. మరొక వైపు ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతుండడంతో ఇంత వరకు 35 లక్షల మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్ విడిచిపెట్టారని లక్షలాది మంది దేశంలోనే తలో ప్రాంతంలో తలదాచుకుంటున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడిరచింది.













