న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో …యోగా దినోత్సవం

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన చారిత్రక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ యోగా సెంటర్ అయింది. 3000 మందికి పైగా ఇక్కడ తాము వెంట తెచ్చుకున్న చాపలను, రబ్బర్ షీట్లను పర్చుకుని యోగాసనాలకు దిగారు. దీనితో రోజువారి టైమ్స్ స్క్వేర్‍కు ఈ రోజు టి స్క్వేర్‍కు పొంతనలేకుండా పోయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ యోగా ఉత్సావాంగా జరిగింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత న్యూయార్క్ పూర్తిగా ఆంక్షలు వీడి సాధారణ జనజీవితపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, స్థానిక స్క్వేర్ అలయిన్స్ సహకారంతో కార్యక్రమం చేపట్టింది.