చేయని నేరానికి 36 ఏండ్ల శిక్ష… 400 కోట్ల పరిహారం
అమెరికాలో ఒక హత్య కేసులో అరెస్టయ్యి 36 ఏండ్లు శిక్ష అనుభవించిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులుగా తేలడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం వారికి 48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) పరిహారంగా చెల్లించనున్నట్టు తెలిసింది. ఆల్ఫ్రెడ్ చెస్ట్నట్, రాంసమ్ వాట్కిన్స్, ఆండ్రూ స్టీవర్ట్ 16 ఏండ్ల వయసులో ఉండగా 1983లో ఒక హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై రీ అప్పీల్ చేశారు. అప్పట్లో తమ కేసు దర్యాప్తు చేసిన అధికారులు ప్రత్యక్ష, భౌతిక ఆధారాలను విస్మరించారని ఆరోపించచడమే కాక, దానిని రుజువు చేయడంతో 2019లో వీరిని విడుదల చేస్తూ ఆదేశాలిచ్చారు.













