ఫ్లోరిడాలో కాల్పుల ఘటన..

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఫ్లోరిడా లోని మియామిలో ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు స్టేట్ కరెక్షన్స్ ఆఫీసర్ కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.