అగ్రరాజ్యం లో మరోసారి కాల్పుల కలకలం
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో నగరంలో స్పోర్టస్ బార్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పులో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బూమ్బూబ్ స్పోర్ట్ క్లబ్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ వ్యక్తి కారులో వచ్చి తుపాకీతో పార్కింగ్ వద్ద ఐదుగురిపై కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తుల అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని పేర్కొన్నారు. ఈ గొడవకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు చెప్పడం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.













