అమెరికాలో మళ్లీ కాల్పులు
అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి వికృత రూపం దాల్చింది. శనివారం అర్థరాత్రి ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌పై ఒక మూక దాడి చేసి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆ కాల్పులు శబద్దం విని అక్కడికి చేరుకునే సరికి దుండుగులు పారిపోయారు. ఘటనా స్థలం నుంచి రెండు సెమీ అటోమెటిక్ హ్యాండ్గన్లు, ఒక మ్యాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రిపూట మార్కెట్‌కు ఈ వీధి ప్రసిద్ధి చెందిందని, వేసవి వీకెండ్ కారణంగా మరింత రద్దీగా ఉందని పోలీసులు తెలిపారు.













