ఉక్రెయిన్ లో డ్రోన్ దాడి… భారతీయుడు మృతి
ఉక్రెయిన్‌లో జరిగిన డ్రోన్ దాడిలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రష్యా సైన్యంలోని సపోర్టు ఉద్యోగాల్లో కొందరు భారతీయులు చేరిన విషయాన్ని కేంద్రం ఇటీవలే ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో తాజా ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హెమిలీ అశ్విన్భాయి మంగూకియా ఈ నెల 21వ తేదీన ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ వద్ద జరిగిన డ్రోన్ దాడిలో మృతి చెందినట్లు తెలిసింది. అయితే దీనిపై స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ నిరాకరించింది. ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో భద్రతా సహాయకులుగా 100 మందికిపైగా భారతీయులను గతేడాది రష్యా ఆర్మీ రిక్రూట్ చేస్తుకున్నట్లు వచ్చిన వార్తలను రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.













