యూఎస్ ఓపెన్ విజేతకు రూ.20.77 కోట్లు
యూఎస్ ఓపెన్ పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలు ఏకంగా రూ.20.77 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ అందుకోనున్నారు. రన్నరప్‌కు రూ.10.38 కోట్లు లభిస్తాయి. నిరుడు విజేతకు రూ.19 కోట్లుగా ఉండేది. కాగా టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ.479.40 కోట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. గత ఏడాడి మొత్తం ప్రైజ్‌మనీ రూ.455.40 కోట్లు. ఈ ఏడాది మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌ల మొత్తం ప్రైజ్‌మనీ కంటే యూఎస్ ఓపెన్ ప్రైజ్‌మనీ ఎక్కువ కావడం విశేషం. మెయిన్ డ్రాలో అడుగుపెట్టిన వారికి రూ.64 లక్షలు అందజేస్తారు. రెండో రౌండ్లో ఓడితే రూ.80 లక్షలు, క్వార్టర్‌ఫైనల్ చేరితే 3.55 కోట్లు, సెమీఫైనల్లో అడుగుపెడితే రూ.5.63 కోట్లు అందజేస్తారు.













