లాస్ ఏంజెలెస్ లో గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం
సంగీత ప్రపంచంలో అత్యుత్తమమైన పురస్కారాలు ఇద్దరు భారత సంతతి కళాకారులకు దక్కాయి. ముంబైలో జన్మించి, అమెరికాలో స్థిరపడిన ఫల్గుణీ షా, అమెరికాలోని భారత సంతతికిచెందిన రిక్కీ కెజ్ గ్రామీ పురస్కారాలు అందుకున్నారు. అమెరికాలో లాస్ ఏంజెలెస్ నగరంలో 64వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. రిక్కీ కెజ్ పోలీసు డ్రమ్మర్ స్టీవార్ట్ కోప్లాండ్తో కలిస డివైన్ టైడ్సె ఆల్బమ్ రూపొందించారు. వీరు బెస్టు న్యూ ఆల్బమ్ కేటగిరిలో గ్రామీణి స్వీకరించారు. రిక్కీ కెజ్ ఈ పురస్కారం అందుకోవడం ఇది రెండోసారి. స్టీవార్ట్‌కు ఇది ఆరో గ్రామీ. రిక్కీ కెజ్ 2015లో విండ్స్ ఆఫ్ సంసార అనే ఆల్బమ్‌కు గాను తొలిసారి గ్రామీ పురస్కారం స్వీకరించారు. ఏ కలర్‌పుల్ వరల్డ్ అనే ఆల్బమ్‌ను రూపొందించిన ఫల్గుణీ షా బెస్టు చిల్డ్రన్ ఆల్బమ్ కేటగిరీలో గ్రామీ అందుకున్నారు.













