అమెరికాలో చరిత్ర సృష్టించిన నల్ల జాతీయ విద్యార్థి
అగ్రరాజ్యం అమెరికాలో ఒక 18 ఏళ్ల విద్యార్థి చరిత్ర షృష్టించాడు. అతిపిన్న వయసులోనే మేయర్గా ఎన్నికయ్యాడు. తూర్పు ఆర్కాన్సాస్లోని చిన్న నగరం ఎర్లేకు మేయర్గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా నల్లజాతీయుడైన జైలెన్ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. అమెరికాలో ఒక నగరానికి మేయర్గా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగానే కాదు, ఆప్రికన్ అమెరికన్ మేయర్స్ అసోసియేషన్ అత్యంత పిన్నవయస్కుడు కావడం గమనార్హం. ప్రస్తుత ఈ అసోసియేషన్లో ఇప్పటి వరకు అత్యంత పిన్న వయస్కుడైన క్లీవ్లాండ్ మేయర్ జస్టిన్ బిబ్ వయసు 35 ఏళ్లు, ఇప్పుడు ఆ రికార్డును స్మిత్ తుడిచిపెట్టేశాడు.













