ఫ్లోరిడా లో విషాదం…

అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం జరిగింది. మియామీలో ఓ పన్నెండు అంతస్తుల భవనం పాక్షికంగా కుప్పకూలింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా 159 మంది జాడ తెలియకుండా పోయింది. వాళ్లు శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. చాంప్లైన్ టవర్స్గా పిలిచే ఈ భవనం సముద్రతీరంలో ఉన్నది. దీంతో విదేశీయులు, పర్యాటకులు ఈ బిల్డింగ్‍లో ఎక్కువగా బస చేస్తారు. కూలడానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. గల్లంతైనవారిలో దాదాపు 22 దేశాలవారున్నట్లు తెలిసింది.