9 ఏళ్ల బాలుడు.. సంపాదన రూ.221 కోట్లు!
అమెరికాలోని టెక్సాస్‌లో పుట్టిన 9 ఏళ్ల ర్యాన్ కాజీ అనే బాలుడు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. అతడి ఛానల్ లో పిల్లలకు సంబంధించిన ఆటలు, సైన్స్, ప్రయోగాలు, మ్యూజిక్ వీడియోలు, స్కిట్స్ ఆర్టస్ అండ్ క్రాఫ్టస్ వీడియోలు ఉన్నాయి. 2018, 2019, 2020 సంవత్సరాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన యూట్యూబర్ గా ర్యాన్ అవార్డులు అందుకున్నాడు. ర్యాన్ గతేడాది యూట్యూబ్ నుండి సుమారు రూ.221 కోట్లు సంపాదించాడని కథనాలు చెబుతున్నాయి. కాగా 2021 మార్చి 28వ తేదీ వరకు ర్యాన్ ఛానల్ కు ప్రస్తుతం 46.16 బిలియన్ వ్యూస్ ఉండగా.. 29.1 మిలియన్ సబ్సైబర్స్ ఉన్నారు. అతడి ఛానెల్ పేరు ర్యాన్ కాజీ యూట్యూబ్ ఛానెల్.













