అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు
అగ్రరాజ్జం అమెరికాలో వరుస తుపాకీ కాల్పుల ఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. సీయాటెల్ శివారు ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. ఒక వివాదం కారణంగా కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఒకరి కన్నా ఎక్కువ మంది కాల్పులు జరిపి ఉండవచ్చని భావిస్తున్నారు. గత నెల 20న వాషింగ్టన్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మరణించారు. అంతకు ముందే జూన్ 1న ఓక్లహామాలోని తుల్సా నగరంలో హాస్పిటల్ క్యాంపస్లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు మరణించారు. వీటన్నింటి కన్నా టెక్సాస్ ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన ఘటన దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో 19 మంది చిన్నారులు చనిపోయారు.













