డొనాల్డ్ ట్రంప్ కు కరోనా టీకా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ట్రంప్‍తో పాటు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు కూడా టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో ఈరోజు నుంచి ఫైజర్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ పక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ట్రంప్, పెన్స్లు త్వరలో వ్యాక్సిన్ తీసుకోనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా వైట్‍హౌస్ సిబ్బందికి, అత్యున్నత ప్రభుత్వాధికారులు కూడా రానున్న పది రోజుల్లో టీకా తీసుకుంటారని పేర్కొన్నాయి.
అయితే ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్న ట్రంప్ టీకా వెంటనే తీసుకుంటారా? లేదా? అనే విషయంలో సృష్టత లేదని అధికారవర్గాలు తెలిపారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‍లు వ్యాక్సిన్ తీసుకునే విషయం ఇంకా తెలియరాలేదని పేర్కొన్నాయి.