ప్రపంచ దేశాలు జాగ్రత్త… డబ్ల్యూహెచ్‍ఓ

కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు 85 దేశాలలో ఉనికిని చాటుకుంది. కరోనా వైరస్‍లలో ఇది అత్యంత ప్రాబల్యపు రకంగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) తెలిపింది. ఇప్పటికే ఇది ప్రబలంగా వ్యాపించింది. ప్రపంచంలో మరికొన్ని ప్రాంతాలకు సోకుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనించాల్సి ఉందని డబ్ల్యూహెచ్‍ఓకు వారం వారం వెలువరించే వైరస్ స్థాయి నివేదిక బులెటిన్‍లో తెలిపారు. భారత్‍లో చాలా నెలల క్రితం తొలిసారిగా ఉనికిని చాటుకున్న ఈ వైరస్ అల్ఫాగా ఉన్నప్పుడు 170 దేశాలలో గుర్తించారు. ఇక బీటా 119, గామా 71 దేశాలు, డెల్టా 85 దేశాలలో విస్తరించింది.