వారు టీకా తీసుకుంటే… వైరస్ నుంచి

వ్యాక్సినేషన్‍తో కొవిడ్‍ను ఎదుర్కోనేలా సహజసిద్ధ రోగనిరోధక శక్తి మరింత పుంజుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అమెరికాలోని రాక్‍ఫిల్లర్ వర్సిటీ పరిశోధకులు కొవిడ్ నుంచి కోలుకున్న 63 మందిపై అధ్యయనం చేశారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు లేదా ఆ తర్వాత కొవిడ్ సోకిన వారిలో యాంటీబాడీలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మెమొరీ-బి సెల్స్లో నిక్షిప్తమై ఉంటే ఈ ప్రతిరక్షకాలు అన్ని రకాల మ్యూటెంట్లను ఎదుర్కోగలవని వివరించారు. కరోనా సోకని వాళ్ల టీకా తీసుకుంటే వైరస్ నుంచి అదనపు రక్షణ లభిస్తుందన్నారు.