మెర్కో కరోనా మాత్రకు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

కరోనాను నియంత్రించేందుకు మెర్క్ కంపెనీ తయారు చేసిన మాత్ర మోన్యుపిరావిర్‌కు అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఫైజర్ మాత్రకు ఎఫ్‌డీఏ ఓకే చెప్పింది. ఫైజర్ పిల్‌తో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, కానీ మెర్క్ పిల్‌తో సైడ్‌ఎఫెక్ట్స్ అధికం. అందుకే దీన్ని సెకండ్ ఛాయిస్ పిల్‌గా అనుమతించారు. కరోనా ఆరంభ లక్షణాలున్న వయోజనులు, అందులో ఆస్పత్రి పాలయ్యే రిస్కు అధికంగా ఉన్నవారికి ఈ పిల్‌ను ఇవ్వవచ్చని సంస్థ తెలిపింది. రోగులు 5 రోజుల పాటు రోజుకు 2 మార్లు 4 మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కోర్సు మొత్తం మీద 400 మాత్రలు అవసరపడతాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చేసిన దాని ప్రత్యుత్పత్తిని తగ్గించేందుకు ఈ ఔషధం తోడ్పడుతుంది.