అమెరికాలో తొలిసారిగా.. జింకకు
అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు. ఓహియా రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది. జంతువుల నుంచి మనుషులు, జంతువుల మధ్య కరోనా వ్యాప్తి పై ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన వెటర్నరీ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలోని కొన్ని జంతువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒక జింకకు కరోనా సోకిన విషయం వెల్లడైంది. ఇప్పటి వరకు కుక్కలు, పిల్లులు, గొరిల్లాలు, చిరుతలు, సింహాలు కరోనా బారినపడగా, జింకకు కరోనా సోకడం ఇదే తొలిసారి.







