ఒక్కరోజు లక్షన్నరకు పైగా కేసులు
అమెరికాలో వరుసగా 12వ రోజు లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో శనివారం నమోదైన కేసుల సంఖ్య 1,66,555. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ 19 కేసుల సంఖ్య 1,12,48,681కి చేరింది. అలాగే, కరోనాతో శనివారం 1,266 మంది చనిపోయారు. దీంతో అక్కడి కరోనా మరణాల సంఖ్య 2,51,330కి చేరింది. అమెరికాలో కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల అసుపత్రులపై భారం మరింత పెరగడంతో పాటు, లాక్డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి రావచ్చనంటున్నారు. మరోవైపు, మెక్సికోలో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అక్కడ కరోనాతో 98,259 మంది చనిపోయారు.






