ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారానికి కరోనా…

అమెరికాలో ఓ నర్సుకు ఫైజర్ టీకా తీసుకున్న వారం రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన 45 ఏళ్ల మాథ్యూ ఈ నెల 18వ తేదీ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఫేస్‍బుక్‍లో పోస్టు చేశాడు. టీకా తీసుకున్న రోజు చేయి నొప్పిగా ఉందని, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్టస్ నమోదు కాలేదన్నారు. టీకా తీసుకున్న ఆరు రోజుల తర్వాత క్రిస్మస్ పండుగ రోజున మళ్లీ అస్వస్థతకు గురైనట్లు అతను చెప్పాడు. హాస్పిటల్‍లోని కోవిడ్ యూనిట్‍లో పనిచేసిన తర్వాత శరీరంలో వణుకు వచ్చిందని, వళ్లు నొప్పులు వచ్చాయని, చాలా నీరసించిపోయినట్లు అతను చెప్పాడు. డ్రైవప్ హాస్పిటల్‍కు వెళ్లి కొవిడ్ టెస్టింగ్ చేసుకున్న అతనికి క్రిస్మస్ మరుసటి రోజున పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న పది నుంచి 14 రోజుల తర్వాత రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అంటువ్యాధుల డాక్టర్ క్రిస్టియన్ రేమర్స్ తెలిపారు. తొలి డోసు తీసుకున్న తర్వాత 50 శాతం రక్షణ వస్తుందని, ఇక రెండవ డోసు తీసుకున్న తర్వాత అది 95 శాతం ఉంటుందని ఆయన అన్నారు.