అమెరికా కీలక ప్రకటన…

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్ సహా విదేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని అమెరికా ఆంక్షలు విధించింది. పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలు ఈ నెల 6 నుంచి అమల్లోకి వస్తాయని అమెరికా ఆరోగ్య విభాగమైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్‌ఎస్‌ఎస్), సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. రెండేళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సున్న ప్రయాణికులందరికీ ఈ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది. ప్రయాణానికి ఒక రోజు ముందుగానే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తీసుకోవాల్సి వుంటుందని తెలిపింది.