ఆ ఉద్యోగులకు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ షాక్

కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించిన 27 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం గత ఆగస్టులో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చట్టం చేసింది. ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి అన్నె స్టెపానెక్ మాట్లాడుతూ తొలగింపబడిన ఉద్యోగులు వ్యాక్సిన్ ఎందుకు నిరాకరించారో కారణాలు తెలుపమని అడిగినప్పుడు వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వారెవరికీ వ్యాక్సిన్ నుంచి మినహాయింపు లభించలేదు అని అన్నారు. ఎయిర్ ఫోర్స్‌లో దాదాపు 97 శాతం ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకున్నారని స్టెఫానెక్ తెలిపారు.