యూపీ సర్కార్ కీలక నిర్ణయం… మాస్క్ లేకుండా కన్పిస్తే

ఉత్తర్‍ప్రదేశ్‍లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన యూపీ సర్కారు లాక్‍డౌన్ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం రాష్ట్రమంతటా లాక్‍డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మాస్క్లు ధరించకుండా పదేపదే కన్పిస్తే రూ.10 వేల వరకు జరిమానా విదించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా ఉద్ధ•తి నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి అన్ని జిల్లాల్లో ప్రతి ఆదివారం కఠిన లాక్‍డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆ రోజు అత్యవసర సేవలు మినహా, అన్ని వ్యాపారా కార్యకలాపాలు మూసివేయాలని స్పష్టం చేసింది. లాక్‍డౌన్ రోజుల్లో బ హిరంగ ప్రదేశాలను శానిటైజ్ చేయాలని ఆదేశించింది.