అమెరికాలో కొత్త వేరియంట్ అలజడి.. భయాందోళనలో ప్రజలు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి మొదలైంది. తాజాగా అక్కడ తొమి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సాస్‌లో 50 ఏళ్ల పైబడిన ఓ వ్యక్తి ఒమిక్రాన్ సోకడంతో మరణించాడు. అయితే మృతుడు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని, దాని ప్రభావంతోనే వైరస్ దాడిని తట్టుకోలేక మృతి చెందినట్లు తెలుస్తోందని హారిస్ కౌంటీ ఆరోగ్య విభాగం తెలిపింది. జీనోవ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్‌లో 73 శాతం ఒమిక్రాన్ కేసులున్నట్లు నిర్ధారణ అయినట్లు సీడీసీ తెలిపింది. వారం వ్యవధిలో 3 శాతం నుంచి వైరస్ వ్యాప్తి అమాంతం పెరిగి ఈ స్థాయికి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.