కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‍లో మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‍కు కరోనా సోకింది. తనకు పాజిటివ్‍గా రిపోర్టు వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.