కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. సామాన్యులే గాక పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వంలో ఈశన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న జితేంద్రసింగ్‍కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జితేంద్ర సింగ్ మీడియాకు వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తనలో కరోనా సింప్టమ్స్ కూడా ఉన్నాయని ట్వీట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అందుకే ఇటీవల తనను కలిసిన వారందరూ దయచేసి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కొన్ని రోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్‍లో ఉండాలని ఆయన కోరారు.