బ్రిటన్ లో ఫైజర్ కు గ్రీన్ సిగ్నల్

ఫైజర్-బయోఎన్‍టెక్ కరోనా వైరస్ టీకా వినియోగానికి బ్రిటన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారం నుంచి వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఫైజర్ బయో ఎన్ టెక్ కోవిడ్ 19 వ్యాక్సిన్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ పై ఇండిపెండెంట్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్టస్ రెగ్యులేటరీ ఏజెన్సీ చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు యూకే ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా వచ్చే వారం నుంచి వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పింది.