4.5 కోట్లు దాటిన కరోనా బాధితులు
కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. వైరస్ విజృంభణతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. 11.80 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్, రష్యాలోనూ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3.27 కోట్ల మంది కోలుకున్నారు. అమెరికాలో మొత్తం బాధితుల సంఖ్య 92 లక్షలకు చేరువలో ఉంది. బ్రెజిల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 54.70 లక్షలకు సమీపించింది. బ్రిటన్లో మొత్తం కేసుల సంఖ్య 9,65,000 దాటింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫొసా స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.






