మంత్రి పువ్వాడ అజయ్‍కుమార్ కు కరోనా

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‍కుమార్ కరోనా పాజిటివ్‍గా పరీక్షించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మంత్రి వైరస్ పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్‍లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‍లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి పువ్వాడ సూచించారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని యథావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన వివరించారు.