కరోనా వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా వందల్లోనే నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ పంపిణీపై అధికారులకు వర్చువల్ శిక్షణనివ్వనున్నారు. శిక్షణలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్‍రావుతో పాటు 33 జిల్లాల డిఎంహెచ్‍వోలు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ ప్రణాళిక, నిల్వ తదితర విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత పర్యవేక్షణ, ప్రజలల్లో ఆందోళనలు తగ్గించడం, వ్యాక్సిన్ ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు శిక్షణను ఇస్తున్నారు.