వారికి కరోనా వ్యాక్సిన్ సురక్షితమే!

గర్భిణులు కరోనా వ్యాక్సిన్లను వేయించుకోవచ్చని, అవి సురక్షితమైనవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమని ఇటీవల ఇంటర్నెట్‍లో వెల్లువెత్తుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. మహిళలు గర్భం దాల్చినప్పుడు మొదట ఏర్పడే మాయకు వ్యాక్సిన్ వల్ల ఎటువంటి హాని కలుగదని పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ఫీన్ బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫరీ గోల్డ్స్టీన్ తెలిపారు.