30 సెకన్లలోనే వైరస్ ఖతం!

ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఫార్మా అభివృద్ధి చేసిన వైరలీజీ నాసల్ స్ప్రే.. ఆల్ఫా (యూకే), బీటా (దక్షిణాఫ్రికా), గామా(జపాన్/బ్రెజిల్) వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నదని అమెరికా చెందిన ప్రఖ్యాత స్క్రిప్స్ పరిశోధన సంస్థ తెలిపింది. వైరలీజీలో ఉండే ఎస్‍పీఎల్ 7013 అనే ఔషధం 30 సెకన్లలోనే వైరస్‍పై ప్రభావం చూపిస్తున్నదని, 5 నిమిషాల వ్యవధిలోనే వైరల్ లోడ్‍ను 99.9 శాతం కంటే ఎక్కువ తగ్గిస్తున్నదని పేర్కొన్నది. భారత్‍లో తొలిసారి వెలుగు చూసిన డెల్టా, కప్పావేరీయంట్‍లపై ఇంకా ప్రయోగించలేదని పరిశోధకులు తెలిపారు.