భారత ప్రభుత్వం కీలక నిర్ణయం… మరో వ్యాక్సిన్ కు అనుమతి

కరోనా కేసులు పెరుగుదలతో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా కరోనా వ్యాక్సిన్ అయిన స్పూత్నిక్-వీ టీకాకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా వ్యాక్సిన్‍కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్తగా చెప్పవచ్చు.