వారికి సింగిల్ డోసు చాలు!

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు ఒక్క డోసు వ్యాక్సిన్ చాలని బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అలాగే కరోనా సోకని వ్యక్తులపైనా వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందో అధ్యయనం చేశారు. కోలుకున్న వ్యక్తుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి వారంలోనే యాంటీబాడీలు అభివృద్ధి చెందగా కరోనా సోకని 90 శాతం మందిలో 3-4 వారాల సమయం పట్టిందని ప్రొఫెసర్ జ్ఞానేవ్వర్ చౌబే తెలిపారు. తమ అధ్యయన ఫలితాలు.. వ్యాక్సిన్ కొరత సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతాయని, ఈ విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాశామని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు సింగిల్ డోస్ ఇవ్వడం ద్వారా టీకా కొరతను అధిగమించవచ్చని పేర్కొన్నారు.