ముక్కు ద్వారా టీకా!
కరోనా వైరస్ నియంత్రణకు ముక్కు ద్వారా ఉపయోగించే టీకా చివర దశ ప్రయోగాలను చేపట్టేందుకు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రయాత్నాలు వేగవంతం చేశాయి. ప్రాథమిక దశ అనంతర ట్రయల్స్‌ను ఈ రెండు సంస్థలు భారీస్థాయిలో చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) త్వరలోనే అనుమతించనుంది. కొద్దినెలల వ్వవధిలోనే దేశంలో ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆఖరి దశ ప్రయోగాల్లో 30-40 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించే అవకాశముందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ వ్యాక్సిన్ ప్రయోగాలు అన్నీ ఇంజక్షన్ రూపంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్రానాసల్ కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను భారత్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.






