సీరం మరో కీలక ప్రకటన..

అమెరికన్ ఫార్మా దిగ్గజం నోవావాక్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న కొవొవాక్స్ ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ కొవిడ్ 19ను నిలువరించడంలో 89.3 శాతం సామర్థ్యం కలిగిఉందని బ్రిటన్‍లో నిర్వహించిన మానవ పరీక్షల్లో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్‍పై దేశీయంగా పరీక్షలు చేపట్టేందుకు సీరం ఇనిస్టిట్యూట్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. నోవావాక్స్తో కొవిడ్ 19 కోసం తమ భాగస్వామ్యంలో రూపొందే కొవొవాక్స్ మానవ పరీక్షల్లో అద్భుత సామర్థ్యం కనబరిచిందని, ఈ వ్యాక్సిన్‍ను భారత్‍లో జూన్ నాటికి లాంఛ్ చేస్తామని ఆశిస్తున్నామని పూనావాలా ట్వీట్ చేశారు. కాగా భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ పక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల వాడకానికి అనుమతించింది.