ప్రపంచ దేశాల్లో ఆస్ట్రేలియా.. ఓ కొత్త రికార్డు

ఆస్ట్రేలియా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త మైలురాయిని అందుకున్నది. 16 ఏళ్లు దాటిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. అద్భుతమైన మైలురాయిని అందుకున్నామని, ప్రపంచంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న దేశాల్లో ఆస్ట్రేలియా ఓ కొత్త రికార్డును నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. అయిదుగురిలో నలుగురికి వ్యాక్సిన్ ఇచ్చామని ఇది ఆస్ట్రేలియా జాతీయ రికార్డు అన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే వ్యాక్సిన్ తీసుకొని వారికి ఇంకా ఆంక్షలు విధిస్తున్నారు. తప్పనిసరి వ్యాక్సిన్ నిబంధనకు వ్యతిరేకంగా సుమారు మూడు వేల మంది మెల్‌బోర్న్‌లో ధర్నా చేశారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో అర్హులైన 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. రాజధాని క్యాన్‌బెరాలో వ్యాక్సినేషన్ 95 శాతం జరిగింది.