నిమిషాల్లో కొవిడ్ గుర్తింపు!

ఎక్స్‌రే సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఎఐ) ఉపయోగించి నిమిషాల్లో కోవిడ్ 19 వైరస్‌ను గుర్తించే కొత్త టెక్నాలజీని స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది 98 శాతం ఫలితాలను ఇస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ స్కాట్లండ్‌లోని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అత్యాధునిక ఎక్స్‌రే సాయంతో, కోవిడ్ రోగులు, ఆరోగ్యవంతమైన వ్యక్తులు, వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్న వ్యక్తులకు చెందిన దాదాపు 3 వేల చిత్రాల డేటాబేస్‌ను కృత్రిమ మేధస్సు స్కాన్ చేసిన కచ్చితమైన ఫలితాల్ని వెల్లడిరచింది అని అది తెలిపింది. ఇది ఆర్‌టి పీసీఆర్ పరీక్షలు అందరికీ వచ్చేలా చూడొచ్చని ఈ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ నయిమ్ రంజాన్ తెలిపారు.