కొవిడ్ వ్యాప్తిని అడ్డుకొనే చూయింగ్ గమ్

కొవిడ్ వైరస్‌కు ఉచ్చు బిగించి అడ్డుకోగల చూయింగ్ గమ్‌ను అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. మొక్కల నుంచి లభించే ప్రొటీన్ పూత గల ఈ చూయంగ్ గమ్ లాలాజలంలో కొవిడ్ వైరస్ ప్రసారాన్ని చాలా వరకు తగ్గిస్తుందని, తద్వారా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని పరిశోధకులు వివరించారు. పూర్తిగా టీకా పొందినప్పటికీ మళ్లీ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని, టీకా పొందని వారిలో ఏ విధంగా వైరస్ వ్యాపించి ఉంటుందో వీరిలో కూడా మళ్లీ వ్యాపించి ఉండవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. లాలాజల గ్రంధుల్లో కొవిడ్ ప్రతిరూపాలు ఉంటుంటాయని, కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, లేదా మాట్లాడినా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్త హెన్నీ డేనియల్ వివరించారు.