రష్యాలో ఇదే తొలిసారి.. ఒక్కరోజులోనే

కరోనా మహమ్మారి రష్యాను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడిరచారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పట్నుంచి ఒక్కరోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో రష్యాలో 28,190 కొత్త కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా 7.8 మిలియన్లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,18,345 మంది కొవిడ్‌తో మృతి చెందినట్లు తెలిపారు. యూరప్‌లో అత్యధిక కొవిడ్ మరణాలు రష్యాలోనే సంభవించడం గమనార్హం.