దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా …

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,32,361 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 24 గంటల్లో కరోనాతో 2,713 మంది మృతి చెందారు. కరోనా నుంచి 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 16,35,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 3,40,702 కరోనా మరణాలు సంభవించాయి. టీకా డ్రైవ్‍లో భాగంగా 22,41,09,448 డోసులు వేసినట్ల్లు తెలిపింది.