దేశంలో భారీగా తగ్గిన… కరోనా కేసులు

దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 18,73,485 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 86,498 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 63 రోజుల తర్వాత కేసుల సంఖ్య లక్ష దిగువకు చేరింది. దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,89,96,473కు పెరిగింది. 24 గంటల్లో 2,123 మంది మరణించగా, ఇప్పటి వరకు కోవిడ్‍తో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309కు పెరిగింది. 24 గంటల్లో 1,82,282 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 2,73,41,462 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 13,03,702 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 36,82,07,596 మందికి కరోనా పరీక్షలు చేశారు.