దేశ చరిత్రలో మరో మైలురాయి

కొవిడ్ 19 పై పోరాటంలో భారత్ తనదైన ముద్రవేసిందని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయి దాటామని ప్రధాని మోదీ అన్నారు. 12-14 ఏళ్ల లోపు వారికి టీకాల కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధానమైన రోజని, దేశంలోని యువత, వృద్ధులకు టీకాలు అందుబాటులోకి తీసుకువచ్చామని, అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాపై పోరాటంలో భారత్ తనదైన ముద్ర వేసిందని, 98 దేశాలకు వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేశామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో తయారైన అనేక సంస్థల వ్యాక్సిన్లను వాడుకోగలుగుతున్నామని, ఇతర దేశాల వ్యాక్సిన్లనూ అనుమతిస్తున్నామని తెలిపారు.