రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ : పీఎం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతి ని ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు.. ఆయన ప్రసంగం లోని ముఖ్యాంశాలు
-ప్రపంచం కినీ వినీ ఎరుగని సంక్షోభంలో చిక్కుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకింది 2.75 లక్షల మంది చనిపోయారు
-మన దేశం ఎన్నో సంక్షోభాలు అధిగమించి నిలబడింది. ఇప్పుడు కూడా కరోనా సై పోరాటం లో మన పోరాటం ప్రపంచస్థాయి లో ప్రశంసలు అందుకుంటోంది.
-కచ్ భూకంపం నేను కళ్లారా చూశాను. అప్పుడు కచ్ తిరిగి కొలుకోలేదు అన్నారు. కానీ ఎంతో గొప్పగా దాని అభివృద్ధి జరిగింది
-కరోనా కి ముందు ప్రపంచాన్ని చూశాం కానీ కరోనా తర్వాత ప్రపంచాన్ని కొత్తగా చూడ బోతున్నాం
-కరోనా కి ముందు భారత దేశంలో ఒక్క పీపీఏ కిట్ లేదు.ఎన్95 మాస్కుల్ని నామ మాత్రం గా ఉత్పత్తి చేసేవాళ్లం. అలాంటిది ఇప్పుడు రోజుకి 2లక్షల కిట్స్, మాస్కులు ఉత్పత్తి చేస్తున్నాం ఆపద ని అవకాశం గా మార్చుకునే సత్తా భారత్ కి ఉంది
-పోలియోకి, మలేరియా వ్యాధుల ను ఎదుర్కోవడం లో, వై2కె సంక్షోభాల సమయంలో భారత్ ప్రపంచానికి పరిష్కారం చూపింది
-దేశాభివృద్ధికి ఆర్ధిక రంగం, మౌలిక వసతుల రంగం, టెక్నాలజీ, డిమాండ్ సప్లయ్ చైన్, వనరులు.. ఈ ఐదూ మూల స్తంభాలు గా ఉన్నాయి.
-ప్రస్తుత పరిస్థితి ని చక్కదిద్దేందుకు రూ20 లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటిస్తున్నాం. ఇది జీడీపీ లో 10 శాతం. ఆత్మ నిర్బర్ భారత్ పేరిట ఈ ప్యాకేజి ద్వారా అన్ని రంగాలు, అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది. ప్యాకేజి వివరాలు ఆర్థిక మంత్రి తెలియజేస్తారు.
– దేశంలో4వ లాక్ డవున్ అమలు అవుతుంది. అయితే ఇది పూర్తిగా కొత్త నియమ నిబంధనలు తో ఉంటుంది. -స్థానిక ఉత్పత్తి, మేడ్ ఇన్ ఇండియా కి మనం ఇకపై ప్రాధాన్యం ఇవ్వాలి. వాటి గురించి ప్రచారం చేద్దాం.
-మనం మరికొంత కాలం కరోనా పై పోరాటం చేయాల్సిందేనని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. స్వయం.నియంత్రణ తో ఈ పోరాటం ప్రతి ఒక్కరు కొనసాగించాలి.
-మనం ధైర్యంగా లక్ష్యం దిశగా సాగాలి. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే గెలుపు సాధించాలి.






