కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన ఈ టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్న విషయాన్ని మంత్రి గోయల్ తన ట్విట్టర్‍లో పోస్టు చేశారు. అర్హులైన వారంతా టీకా వేసుకోవాలన్నారు. చుట్టు ఉన్నవారిని కూడా టీకా తీసుకునే విధంగా ఎంకరేజ్ చేయాలన్నారు. అందరం కలిసి సురక్షితమైన, ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మిద్దామని, భారత్ నుంచి కోవిడ్‍ను తరిమేద్దామని గోయల్ అన్నారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ టీకా ఇస్తున్న సంగతి తెలిసిందే. టీకా తీసుకునేవాళ్లు కోవిన్ పోర్టల్‍లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.